భారత సంతతి దర్శకుడికి ఆస్కార్ | Asif Kapadia wins Oscar for 'Amy' | Sakshi
Sakshi News home page

భారత సంతతి దర్శకుడికి ఆస్కార్

Published Mon, Feb 29 2016 10:43 AM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

భారత సంతతి దర్శకుడికి ఆస్కార్

భారత సంతతి దర్శకుడికి ఆస్కార్

భారత సంతతికి చెందిన బ్రిటిష్ దర్శకుడు ఆసిఫ్ కపాడియాకు ఆస్కార్ అవార్డు దక్కింది. 'ఎమీ' అనే చిత్రానికి సంబంధించి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. ఎమీ వైన్‌హౌస్ అనే దివంగత గాయకురాలి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్‌లో నటించిన దేవ్ పటేల్, మరో నటి డైసీ రిడ్లే కలిసి దర్శకుడు కపాడియా, నిర్మాత జేమ్స్ గే రీస్‌లకు ఈ అవార్డు అందజేశారు. ఈ సినిమా ఇంతకు ముందు గ్రామీ అవార్డు కూడా గెలుచుకుంది.

ఎమీ కేవలం 27 ఏళ్ల వయసులోనే మరణించింది. ఆమె జీవించి ఉండగా రూపొందించిన కొన్ని ఆల్బంలతో పాటు కొన్ని ఆర్కైవ్ల ఫుటేజిని కూడా ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. కపాడియా, గే-రీస్‌లకు ఆస్కార్ నామినేషన్ లభించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్‌ (బాఫ్టా) అవార్డును కూడా ఈ సినిమా గెలుచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement