ట్రైలర్‌లోనే 30 కిక్స్‌.. చిత్రంలో ఎన్నుంటాయో? | Baaghi trailer to have 30 flying kicks | Sakshi
Sakshi News home page

ట్రైలర్‌లోనే 30 కిక్స్‌.. చిత్రంలో ఎన్నుంటాయో?

Published Mon, Mar 14 2016 8:13 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

ట్రైలర్‌లోనే 30 కిక్స్‌.. చిత్రంలో ఎన్నుంటాయో?

ట్రైలర్‌లోనే 30 కిక్స్‌.. చిత్రంలో ఎన్నుంటాయో?

యాక్షన్‌ సినిమాగా జనాల్లోకి వెళ్లాంటే.. దానికి తగ్గట్టుగా హీరో విన్యాసాలను ట్రైలర్‌లో చూపాల్సిందే. సినిమాలో హీరో ఎన్ని ఫైట్లు చేస్తాడు, ఎంతమందిని చితకబాదుతాడు, విలన్‌తో ఎలా పోరాడుతాడు.. ఇలా చిత్రకథకు సంక్షిప్తరూపంలో ట్రైలర్‌ ఉంటేనే ఆ సినిమా సత్తా ఏంటో చూచాయగా ప్రేక్షకులకు తెలిసే అవకాశముంటుంది.

అందుకే టైగర్ ష్రఫ్‌, శ్రద్ధకపూర్ జంటగా నటిస్తున్న తాజా యాక్షన్ మూవీ 'బాగీ' ట్రైలర్‌లో ఏకంగా 30 ఫ్లయింగ్ కిక్స్‌ను చూపించారు. యాక్షన్ పవర్‌ప్యాక్‌గా వస్తున్న ఈ సినిమాకు దర్శకుడు సబీర్ ఖాన్. ఈ సినిమాతో మహేశ్‌బాబు బావ, టాలీవుడ్ హీరో సుధీర్‌ బాలీవుడ్‌కు విలన్‌గా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే 'హీరోపాంటీ' చిత్రంతో తానేంటో నిరూపించుకున్నట్రైగర్‌ ష్రఫ్ ఈ సినిమాతో తన యాక్షన్ స్టామినాను చూపించబోతున్నాడని, అతను చేసిన యాక్షన్ దృశ్యాలు ప్రేక్షకులను విస్మయపరుస్తాయని దర్శకుడు సబీర్ ఖాన్ చెప్తున్నాడు. ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement