భూమిపై ఉన్న బ్రాడ్‌పిట్‌తో మాట్లాడుతున్న అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగామి నిక్ హేగ్
లాస్‌ఏంజెలిస్: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–2 కు చెందిన విక్రమ్ ల్యాండర్ కనిపించిందా అని ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) లోని వ్యోమగామిని ప్రశ్నించాడు. కనిపెట్టలేకపోయామని సదరు వ్యోమగామి సమాధానమిచ్చాడు. తన కొత్త చిత్రం ‘ఆడ్ ఆస్ట్రా’ ప్రమోషన్లలో భాగంగా బ్రాడ్‌పిట్ ఐఎస్‌ఎస్‌లోని నాసా వ్యోమగామి నిక్ హేగ్‌తో సంభాషించాడు. ఆడ్ ఆస్ట్రా చిత్రంలో బ్రాడ్‌పిట్ వ్యోమగామిగా నటించాడు.20 నిమిషాలపాటు సాగిన ఈ సంభాషణను సోమవారం నాసాటీవీ ప్రసారం చేసింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన రోజు తాను నాసా కేంద్రంలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబ్‌లో ఉన్నానని, అప్పుడు ఇస్రోకు నాసా సహ కారమందించడాన్ని గమనించానని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment