
'సినిమా కలెక్షన్లు ఇస్తామనలేదు'
ముంబై: నేపాల్ బాధితుల కోసం 'గబ్బర్' సినిమా మొదటి రోజు కలెక్షన్లు విరాళంగా ఇవ్వనున్నట్టు వచ్చిన వదంతులను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తోసిపుచ్చాడు. దీని గురించి తాను ఎటువంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశాడు. ఇలాంటి నిర్ణయాలు నిర్మాత తీసుకోవాల్సి ఉంటుందని, ఈ సినిమాకు తాను నిర్మాతను కాదని అన్నాడు. తాను సహాయం చేయాలనుకుంటే సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడబోనని ట్విటర్ లో పేర్కొన్నాడు. నేపాల్ భూకంప బాధితులకు సహాయం చేయాలనుకునే వారికోసం ఏర్పాటు చేసిన ఫేస్ బుక్ లింకును తన ట్విటర్ లో పెట్టాడు.
అక్షయ్ కుమార్, శృతిహాసన్ జంటగా నటించిన 'గబ్బర్' సినిమా మే 1న విడుదల కానుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంజయ్ లీలా బన్సాలీ, వయకోమ్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. 2002లో తమిళంలో వచ్చిన 'రమణ' సినిమాకు ఇది రీమేక్.
Heard a rumour that I am donating #GabbarIsBack's 1st day collections to the #NepalEarthquake victims. (cont) http://t.co/NMjqMOcJlw
— Akshay Kumar (@akshaykumar) April 28, 2015