సీఎం భద్రతను గాలికొదిలేసి.. హీరో ఇంటికి | cm security police went to prabhas house | Sakshi
Sakshi News home page

సీఎం భద్రతను గాలికొదిలేసి.. హీరో ఇంటికి

Oct 31 2015 3:39 PM | Updated on Sep 15 2018 8:43 PM

సీఎం భద్రతను గాలికొదిలేసి.. హీరో ఇంటికి - Sakshi

సీఎం భద్రతను గాలికొదిలేసి.. హీరో ఇంటికి

సినీ హీరోల మీద అభిమానానికి స్థాయి బేధాలు ఉండవు. అయితే తమ పని వదిలిపెట్టి మరీ హీరోల మీద అభిమానాన్ని చాటుకుంటేనే అసలుకే మోసం వస్తుంది. ఇలాంటి పరిస్థితే తెలంగాణ పోలీసులకు...

సినీ హీరోల మీద అభిమానానికి స్థాయి బేధాలు ఉండవు. అయితే తమ పని వదిలిపెట్టి మరీ హీరోల మీద అభిమానాన్ని చాటుకుంటేనే అసలుకే మోసం వస్తుంది. ఇలాంటి పరిస్థితే తెలంగాణ పోలీసులకు ఎదురైంది. బాహుబలి సక్సెస్ తరువాత చాలా రోజులు పాటు ఫారిన్ టూర్లో ఉన్న ప్రభాస్ ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చాడు. చాలా కాలం తరువాత తిరిగి రావటంతో అతడిని కలిసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రభాస్ ఇంటి దగ్గరకు చేరుకున్నారు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అదే సమయంలో అక్కడ సీఎం సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న కొంత మంది పోలీసులు కూడా డ్యూటి వదిలేసి ప్రభాస్ను చూసేందుకు వెళ్లారు. సీఎం కేసీఆర్ అదే దారిలో వస్తున్నట్టుగా ముందస్తు సమాచారం ఉన్నా, ఆ విషయాన్ని పక్కన పెట్టి  హీరోను చూసేందుకు వెళ్లారు. ఈ విషాయాన్ని ఆలస్యంగా గమనించిన ఉన్నతాధికారులు, సదరు పోలీసులను పిలిపించి గట్టిగా క్లాస్ తీసుకున్నారు. అంతేకాదు జరిగిన ఘటన పై పూర్తి స్ధాయి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించినట్టుగా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement