ఆ బాధ నాకు తెలుసు! | Deepika Padukone Reveals why Amitabh Bachchan was not Invited to 'Piku' Success Party | Sakshi
Sakshi News home page

ఆ బాధ నాకు తెలుసు!

Published Tue, Jun 2 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

ఆ బాధ నాకు తెలుసు!

ఆ బాధ నాకు తెలుసు!

 దీపికా పదుకొనే ‘పీకూ’ ఘనవిజయంతో మంచి జోష్ మీద ఉన్నారు. ఇటీవలే ఆమె ఓ పెద్ద పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి షారుక్‌ఖాన్, రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్, కంగనా రనౌత్, ప్రియాంకా చోప్రా... ఇలా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులను పార్టీకి ఆహ్వానించారు. కానీ ర ణ్‌బీర్ కపూర్, కత్రిన ఈ పార్టీకి హాజరుకాలేదు. దీని గురించి దీపిక స్పందిస్తూ- ‘‘రణ్‌బీర్, కత్రినాలు రాకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. కానీ అర్థం చేసుకోగలను. ‘తమాషా’ షూటింగ్ సమయంలో ‘బాంబే వెల్వెట్’ సినిమా గురించి, అందులో తన పాత్ర గురించి రణ్‌బీర్ చెప్పేవాడు. కానీ ఆ సినిమా అంతగా ఆడకపోవడం దురదృష్టమే. ఒక వేళ వాళ్లు  పార్టీకి వచ్చినా నేను ఆ సినిమా గురించి అడిగి  ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. ఎందుకంటే నేను అలాంటి దశలను దాటుకునే వచ్చాను. ఆ బాధేంటో నాకు తెలుసు. ’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement