
అవయవదానం చేయనున్న మణిరత్నం దంపతులు
చెన్నై: ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం, ఆయన సతీమణి, నటి సుహాసిని అవయవదానం చేయనున్నట్లు వెల్లడించారు.
చెన్నైలో సాగా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో వీరితో పాటు చారుహాసన్, కోమలం చారుహాసన్ దంపతులు తమ అవయవాలను దానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీతదర్శకుడు భరద్వాజ్ నేతృత్వంలో సంగీత విభావరి కూడా నిర్వహించారు.