ఆ అలవాట్లు మానుకుంటున్న హీరోలు | finally shahid kapoor quits smoking for meera | Sakshi
Sakshi News home page

ఆ అలవాట్లు మానుకుంటున్న హీరోలు

Published Thu, Dec 24 2015 9:13 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM

ఆ అలవాట్లు మానుకుంటున్న హీరోలు

ఆ అలవాట్లు మానుకుంటున్న హీరోలు

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. పెళ్లి తర్వాత సినిమాలతో కన్నా ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో కనిపిస్తున్నాడు ఈ హీరో. తాజాగా తన భార్య కోసం తీసుకున్న నిర్ణయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఏడాది జూలై 7న మీరా రాజ్పుత్ని పెళ్లి చేసుకున్న షాహిద్ ఆమె కోసం సిగరెట్ కాల్చటం మానేశాడట. సిగరెట్ అలవాటు లేని షాహిద్ ని తను మరింత ఇష్టపడతానని చెప్పి, ఈ దురలవాటు నుంచి షాహిద్ను దూరంగా చేసింది అతడి సతీమణి.

షాహిద్ మాత్రమే కాదు గతంలో మరి కొంతమంది హీరోలు కూడా ఇలా కుటుంబం కోసం తమ అలవాట్లను మానుకున్నారు. బాలీవుడ్ బాద్ షా.. షారూఖ్ కూడా చిన్న కొడుకు అబ్రామ్ పుట్టిన తరువాత స్మోకింగ్కు దూరంగా ఉంటున్నాడు. ఇక మన టాలీవుడ్ రాజకుమారుడు మహేష్ బాబు సైతం తన కొడుకు గౌతం కోసం సిగరెట్ తాగటం మానేశాడు. తెర మీద హీరోలుగా కనిపించే మన ఫిలిం సెలబ్రిటీలు, తన నిర్ణయాలతో నిజ జీవితంలో కూడా హీరోలనిపించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement