మహేష్తో షారుఖ్ ఖాన్..
శనివారం రామోజీ ఫిలిం సిటీ ఓ అరుదైన కలయికకు వేదిక అయ్యింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కలిశారు. మహేష్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో జరిగే బ్రహోత్సవం సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. కొద్ది రోజులుగా షారూఖ్ కూడా దిల్వాలే సినిమా కోసం ఫిలింసిటీలో ఉన్నారు.
గత రెండు మూడు రోజులుగా షూటింగ్ బిజీ లేకపోవటంతో ఫ్రీగా ఉన్న షారూఖ్ బ్రహ్మోత్సవం సెట్ లో మహేష్ ను కలిశారు. షారూఖ్ సడన్ విజిట్తో యూనిట్ సభ్యులంతా థ్రిల్ అయ్యారు. మహేష్ కూడా తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'ఈ రోజు బ్రహ్మోత్సవం సెట్ లో షారూఖ్ ను కలవడం ఆనందంగా ఉంది. మన యూనిట్ సభ్యులంతా థ్రిల్ అయ్యారు. థ్యాంక్స్ సర్' అంటూ ట్వీట్ చేశాడు మహేష్.