
సినీ ప్రపంచంలో జాకీచాన్ తెలియని వారుండరు. యాక్షన్ చిత్రాలకు జాకీచాన్ ఫేమస్. కేవలం చైనాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు జాకీచాన్. ప్రస్తుతం ఈ సూపర్‌స్టార్‌ను హృతిక్ రోషన్ కలిసి కాసేపు ముచ్చటించాడు. తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చైనాకు వెళ్లిన హృతిక్ జాకీచాన్‌ను కలిశాడు.
హృతిక్ రోషన్, యామీ గౌతమ్ జంటగా వచ్చిన కాబిల్(తెలుగులో ‘బలం’) చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేయనున్నారు. జూన్ 5న విడుదల కానున్న ఈ చిత్రానికి చిత్రయూనిట్ ప్రమోషన్స్ పెంచేసింది. ఇందులో భాగంగానే జాకీచాన్‌ను హృతిక్‌రోషన్ కలిశాడు. ఇప్పటికే చైనా మార్కెట్‌లో ఇండియన్ సినిమాలు దుమ్ములేపుతుండగా.. హృతిక్ నటించిన కాబిల్ ఏమేరకు రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. 2017లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment