నో సెటైర్స్‌... ఓన్లీ కామెడీ | Huma Qureshi on Jolly LLB 2, Akshay Kumar and link up rumours with Sohail Khan! | Sakshi
Sakshi News home page

నో సెటైర్స్‌... ఓన్లీ కామెడీ

Published Sat, Jan 28 2017 11:14 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

నో సెటైర్స్‌... ఓన్లీ కామెడీ

నో సెటైర్స్‌... ఓన్లీ కామెడీ

‘‘యాక్షన్‌ హీరోగా నాకు మంచి గుర్తింపు ఉంది. ఆ ఇమేజ్‌కి భిన్నమైన పాత్రలు చేయాలని చేసిన ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు అక్షయ్‌కుమార్‌. ఆయన హీరోగా నటించిన హిందీ సినిమా ‘జాలీ ఎల్‌ఎల్‌బి–2’ ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక హ్యూమా ఖురేషితో కలసి అక్షయ్‌ హైదరాబాద్‌ వచ్చారు. ఆయన మాట్లాడుతూ – ‘‘నేనెప్పుడూ న్యాయవాది పాత్ర చేయలేదు. సో, ఈ కథ వినగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. న్యాయవ్యవస్థపై సెటైరికల్‌ సినిమా కాదిది... అందులో లోపాలను ఎత్తిచూపే ప్రయత్నమూ చేయలేదు.

వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన కామెడీ మూవీ ఇది. ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌. ఈ సీక్వెల్‌ను కొత్త కథతో తెరకెక్కించాం. ‘జాలీ ఎల్‌ఎల్‌బి’లో హీరోగా నటించిన అర్షద్‌ వార్సితో నా నటనను పోల్చి చూస్తారని తెలుసు. అర్షద్‌ చిన్నోడు కాదు, మంచి నటుడు. నా స్నేహితుడు కూడా. ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ తరహాలో ఈ సీక్వెల్‌ కూడా మంచి హిట్టవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘అక్షయ్‌తో నటించడం హ్యాపీ. సినిమాలో నాకు, ఆయనకూ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది’’ అన్నారు హ్యూమా ఖురేషి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement