బాలయ్య హీరోయిన్ కోసం వేట | Hunt for Nandamuri Balakrishna heroine | Sakshi
Sakshi News home page

బాలయ్య హీరోయిన్ కోసం వేట

Published Tue, Sep 17 2013 12:28 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలయ్య హీరోయిన్ కోసం వేట - Sakshi

బాలయ్య హీరోయిన్ కోసం వేట

యువరత్న నందమూరి బాలకృష్ణ సినిమాకు హీరోయిన్ల సమస్య వచ్చి పడింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమాకు కొత్త హీరోయిన్ కోసం గాలిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ను ఇప్పటికే ఎంపిక చేసినా కొత్త ముఖం కోసం అన్వేషిస్తున్నారు. 'కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎవర్నీ ఇంకా ఎంపిక చేయలేదు. కొత్త హీరోయిన్ను తీసుకోవాలని భావిస్తున్నాం. అవసరమైతే బాలీవుడ్ నుంచి ఒకర్ని ఎంపిక చేస్తాం. వారం రోజుల్లో పేరును ఖరారు చేస్తాం" అని చిత్ర యూనిట్ వర్గం సభ్యుడు ఒకరు తెలిపారు.  

బాలయ్య సినిమాలో మరో హీరో జగపతి బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.  టైటిల్గా 'రూలర్', 'జయసింహ' తదితర పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఐతే అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఈ సినిమాను '14 రీల్స్ ఎంటర్టైన్మెంట్' సంస్ధ నిర్మిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement