వాళ్లతో రొమాన్స్ చేయాలని ఉంది!
ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని ఎనర్జీతో వరుసగా సినిమాలు చేసేస్తున్నారు అమితాబ్ బచ్చన్. అలాగే, యాడ్స్‌లోనూ నటిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్న బచ్చన్‌కి ఓ అసంతృప్తి ఉందట. కథానాయికలతో రొమాన్స్ చేసే వయసులో లేకపోవడం అనే అసంతృప్తి వెంటాడుతోందని అమితాబ్ అంటున్నారు. ముఖ్యంగా విద్యాబాలన్, దీపికా పదుకొనె, కంగనా రనౌత్, ఆలియా భట్ వంటి భామలతో హీరోగా నటించే వయసులో లేకపోవడం చాలా బాధగా ఉందని ఆయన పేర్కొన్నారు. వాళ్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న హీరోలను చూస్తే అసూయగా ఉందని బిగ్ బి సరదాగా అన్నారు.