2018లో జరగనున్న 90వ ఆస్కార్స్‌కు గాను ‘ఉత్తమ ఫారిన్ ల్యాంగ్వేజ్ చిత్ర విభాగం’లో భారతదేశం తరçపున ‘న్యూటన్’ అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన విషయం తెలిసిందే. అమిత్ వి. మసూర్కర్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ రావ్ నటించిన ఈ సినిమాకు తొలి రౌండ్‌లోనే నిరాశ ఎదురైయింది. ఈ క్యాటగిరీలో తర్వాతి రౌండ్‌కు సెలెక్ట్ అయిన తొమ్మిది చిత్రాల లిస్ట్‌ను ఆస్కార్ అవార్డ్స్ అందించే ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ విడుదల చేసింది. ఆ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది ‘న్యూటన్’.
ఇది వరకు ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’ ఈ క్యాటగిరీలో చోటు దక్కించుకున్నప్పటికీ అవార్డుని సొంతం చేసుకోలేకపోయాయి. ఆస్కార్‌లో అన్ని విభాగాల నామినేషన్‌ల పూర్తి వివరాలను జనవరి 23న విడుదల చేస్తారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చ్ 4న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగనుంది. ‘‘ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో మొత్తం 92 సినిమాలు పోటీకి వచ్చాయి. అక్కడిదాకా మా సినిమా వెళ్లినందుకు మాకు ఆనందంగా ఉంది. నామినేషన్ దక్కలేదనే బాధ లేదు. ఈ అనుభవం మరిన్ని మంచి సినిమాలు చేయడానికి నాకు ఉత్సాహాన్నిచ్చింది’’అన్నారు దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment