
ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, తరువాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైప్‌ను ఫైనల్ చేశారన్న టాక్ గట్టిగానే వినిపించింది.
ఈ విషయంపై కత్రినా కైఫ్ స్పందించారు. ప్రస్తుతం భారత్ సినిమాలో నటిస్తున్న కత్రినా తదుపరి చిత్రం ఇంకా ఫైనల్ చేయలేదని తెలిపారు. ఇక మహేష్ తో సినిమా విషయానికి వస్తే అలాంటి ప్రపోజల్ ఏది తన వద్దకు రాలేదన్నారు కత్రినా. దీంతో మహేష్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో కత్రినా హీరోయిన్ అన్న రూమర్స్‌కు తెరపడింది.