సంబరపడుతోన్న కీర్తి సురేష్‌! | Keerthy Suresh Tweet About Pandem Kodi 2 Release | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 13 2018 4:53 PM | Last Updated on Fri, Jul 13 2018 4:55 PM

Keerthy Suresh Tweet About Pandem Kodi 2 Release - Sakshi

‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్‌ నటిగా అందరిని మెప్పించారు. సినీ ప్రముఖులే కాక విమర్శకుల ప్రశంసలను కూడా పొందారు. మహానటి తరువాత ఏ తెలుగు ప్రాజెక్టులను ఓకే చేయని కీర్తి.. తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. 

తమిళంలో విక్రమ్‌, విజయ్‌, విశాల్‌ సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో విశాల్‌ పందెంకోడి 2 అక్టోబర్‌ 18న రాబోతున్న విషయం తెలిసిందే. కీర్తి ఇదే విషయాన్ని చెబుతూ.. ‘నా బర్త్‌డే (అక్టోబర్‌ 17) అయిన వెంటనే ఈ సినిమా రిలీజ్‌ కాబోతోందం’టూ.. హ్యాపిగా నవ్వుతున్న ఎమోజీలను ట్వీట్‌ చేశారు. ఎన్‌ లింగుస్వామి దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీని విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement