
కొరటాల శివ, అల్లు అర్జున్
మూడు సినిమాలతోనే టాప్ డైరెక‍్టర్స్ లిస్ట్‌లో చేరిపోయిన దర్శకుడు కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలతో ఘన విజయాలు సాధించిన కొరటాల శివ, ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా భరత్ అనే నేను సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 27న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత కొరటాల మరో స్టార్ హీరోతో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట.
ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైంది. కానీ ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపించటం లేదు. రంగస్థలం రిలీజ్ తరువాత బోయపాటి, రాజమౌళిలతో చరణ్ సినిమాలు చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర‍్తయితేగాని మరో సినిమా చరణ్ డేట్స్ ఇవ్వలేడు. అందుకే ఈ గ్యాప్ లో మరో మెగా హీరో అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడట కొరటాల. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం వచ్చింది.