
ముంబై : తనకు ఎంతో ఇష్టమైన పోల్ డ్యాన్స్‌ను చాలా మిస్సవుతున్నానంటూ బాలీవుడ్ నటి కృతి కర్భందా విచారం వ్యక్తం చేసింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో తన ప్రియుడైన పుల్కిత్ సామ్రాట్‌తో డేటింగ్ చేస్తున్న కృతి ముంబైలో ఉంటుంది. తాజాగా కృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోల్ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి షేర్ చేసింది. ఈ వీడియో పాతదే అయినా పోల్ డ్యాన్స్‌పై ఆమెకున్న ఇష్టాన్ని మరోసారి చెప్పుకొచ్చింది. ' లాక్‌డౌన్ కారణంగా నాకు ఇష్టమైన పోల్ డ్యాన్స్‌ను మిస్సవుతున్నా. ఈ సమయంలో మా ఇంట్లో పోల్ ఉంటే బాగుండేది..రోజు నాకు నచ్చినంత సేపు పోల్ డ్యాన్స్ చేసుకునేదాన్ని. లాక్‌డౌన్ తర్వాత పోల్ డ్యాన్స్‌ను చేయాలని అనుకుంటున్నా. నాలాగే మీరు ఏదైనా ఫేవరెట్ ఆటను మిస్సవుతే షేర్ చేసుకోండి' అంటూ కృతి పేర్కొంది. కృతి కర్భందా తెలుగులో భోణి, తీన్‌మార్, మిస్టర్ నూకయ్య, ఓం త్రీడి, బ్రూస్‌లీ, ఒంగోలు గిత్త చిత్రాల్లో నటించింది.
(అమెరికాలోని ఒక వీధికి చైనా డాక్టర్ పేరు !)
Comments
Please login to add a commentAdd a comment