
‘భరత్ అనే నేను’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత సూపర్‌స్టార్ మహేష్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్, సాంగ్‌తో ఓ రేంజ్‌లో హైప్‌ను క్రియేట్ చేసిన మహర్షి చిత్రయూనిట్.. తాజాగా రెండో పాటను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం.. అంటూ సాగే ఈ పాట అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ లిరికల్ వీడియోలో మహేష్ అదిరిపోయేలా ఉన్నారని అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ మూవీని దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.