
మహేశ్‌బాబు
వందల మంది జనం. భరత్‌పై అభిమానంతో వచ్చారు వాళ్లంతా. కొందరు మాత్రం పగతో కత్తులు తెచ్చారు. భరత్‌పై దాడి చేయడానికి అవకాశం కోసం చూస్తున్నారు. కత్తి కంటే పదునైన ఆలోచనతో వారిని కనిపెట్టి, శత్రువుల భరతం పట్టాడు భరత్. అదెలాగో సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమతి డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’.
ఇందులో కియరా అద్వాని కథానాయిక. సీయం భరత్ పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. రిపబ్లిక్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ ఓత్ అండ్ మహేశ్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోందని చిత్రబృందం చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్‌ను రామ్–లక్ష్మణ్ నేతృత్వంలో హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫైట్ ఓ పబ్లిక్ మీటింగ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకంటున్నారు.