సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మనసుకి నచ్చింది’ | Manasuku Nachindi censor Completed | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 22 2018 11:20 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

Manasuku Nachindi censor Completed - Sakshi

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.  ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకొని ‘యు/ఎ’ సర్టిఫికెట్ అందుకొంది. ఫిబ్రవరి 16న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నద్ధమవుతోంది. 

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్రెష్ & రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మనసుకి నచ్చింది తెరకెక్కింది. సెన్సార్ పూర్తయ్యింది, యు/ఎ సర్టిఫికేషన్ సొంతం చేసుకుంది. రాధన్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలుస్తుంది. ప్రేక్షకులకి ఒక మంచి సినిమా చూశామనే భావన కలిగించే చిత్రం మనసుకు నచ్చింది’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement