ఆ హీరోయిన్ కూతురి తెరంగేట్రం | meena's daughter nainika as samantha's daughter | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్ కూతురి తెరంగేట్రం

Published Wed, Nov 25 2015 3:43 PM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM

ఆ హీరోయిన్ కూతురి తెరంగేట్రం

ఆ హీరోయిన్ కూతురి తెరంగేట్రం

హైదరాబాద్:  బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి, దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా  వెలిగిన నటి మీనా కూతురు నైనిక వెండితెరకు పరిచయం కాబోతోంది. విజయ్ హీరోగా తెరకెక్కున్న ఓ కోలీవుడ్ మూవీలో మీనా ముద్దుల చిన్నారి  తెరంగేట్రం చేయనుంది. మరోవైపు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ సమంత ఈ సినిమాలో మరోసారి తల్లిపాత్రలో కనిపించబోతోంది. మొదటి సారి మనం సినిమాలో తల్లిపాత్రలో అలరించిన సమంత  ఈ సారి మరో హీరోయిన్ కూతురికి తల్లిగా నటించనుంది.

అయితే హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉన్న సమయంలో తల్లిపాత్ర ద్వారా సాహసం చేసిన  సామ్స్ తర్వాత మళ్ళీ వెండితెరపై తల్లి పాత్రను చేయకూడదనుకొన్నదట. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ తల్లి పాత్రలో కోలీవుడ్ సినిమాలో కనిపించబోతున్నది. విజయ్ హీరోగా రాజా రాణి దర్శకుడు అట్లీ ... కలిపులి ధాను నిర్మాతగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా సమంత నటిస్తుండగా.. మరో హీరోయిన్ గా అమీ జాక్సన్ నటిస్తున్నది. కాగా ఈ సినిమాలో సమంత ఓ కూతురికి తల్లిగా నటించబోతోంది. ఈ కూతురు పాత్రలోనే నైనిక కనిపించబోతోంది.  దీంతో  బాలనటిగా నైనిక మురిపిస్తుందా...తల్లి  మీనాను మరిపిస్తుందా అనే ఊహాగానాలు  మొదలయ్యాయట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement