ఏమాయ చేసావేకి’ నెక్ట్స్ లెవల్
నాగచైతన్య, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఏమాయ చేశావె’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. మంజిమా మోహన్ కథానాయిక. మిర్యా సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలవుతోంది. గౌతమ్ మీనన్ మాట్లాడుతూ -‘‘ ‘ఏమాయ చేసావే’ నెక్ట్స్ లెవల్ మూవీ ఇది.
ఆ చిత్రంలోని అబ్బాయి మగాడు అయిన తర్వాత అతడి ప్రవర్తన ఎలా ఉంటుందన్నది ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు. ‘‘గౌతమ్ మీనన్‌గారి దర్శకత్వంలో సినిమా చేస్తున్న ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నా. నన్ను సరికొత్త స్టయిల్‌లో చూపిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అని నాగచైతన్య చె ప్పారు. నిర్మాతలు ‘దిల్’రాజు, బెల్లంకొండ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.