'టెంపర్'లో ఎన్టీఆర్ కొత్తలుక్ విడుదల | new look of ntr in temper movie released in twitter | Sakshi
Sakshi News home page

'టెంపర్'లో ఎన్టీఆర్ కొత్తలుక్ విడుదల

Published Mon, Dec 29 2014 6:25 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

'టెంపర్'లో ఎన్టీఆర్ కొత్తలుక్ విడుదల - Sakshi

'టెంపర్'లో ఎన్టీఆర్ కొత్తలుక్ విడుదల

ఎన్టీఆర్.. పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న టెంపర్ సినిమాలో హీరో కొత్త లుక్ విడుదలైంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎన్టీఆర్ మంచి స్టైలిష్గా.. టేబుల్ మీద కాలు పెట్టుకుని కుర్చీలో కూర్చున్న ఫొటోను బయటపెట్టారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్ బాగా రఫ్గా కనిపిస్తున్నాడు. దీన్ని చూసి.. టెంపర్ చిత్రం మీద ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి.

ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తున్న ‘టెంపర్’ సినిమాను వాస్తవానికి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక, నిర్మాతలు భావించారు. అయితే, దాదాపు పదిరోజుల పాటు సాగిన తెలుగు సినీ కార్మికుల సమ్మె, ఆ వెంటనే ఎన్టీఆర్ సోదరుడు నందమూరి జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో ఆకస్మిక మృతితో షూటింగ్‌కు బ్రేక్ పడింది. తర్వాత మళ్లీ హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్ చేసుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement