
వెండితెర ‘భీష్మ’ తొలి అడుగు విజయవంతంగా ముగిసింది. ‘ఛలో’ సినిమాతో ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘భీష్మ’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ శుక్రవారంతో ముగిసింది. ఈ షెడ్యూల్ 25 రోజుల పాటు సాగింది. హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాని తెలిసింది. అలాగే ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ ఆగస్టు 16న ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.