
ధోనీ భార్యగా పరిణీతి చోప్రా?
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జీవితగాథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రంలో ధోనీ భార్య పాత్ర
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జీవితగాథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రంలో ధోనీ భార్య పాత్ర పోషించే కీలక అవకాశం పరిణీతి చోప్రాకు దక్కిందని సమాచారం. పరిణీతి కంటే ముందు చిత్ర దర్శక నిర్మాతలు ఈ పాత్ర కోసం ఆలియా భట్, శ్రద్ధా కపూర్, కీర్తి సానన్‌లను సంప్రదించారట. అయితే, వారెవరూ పాత్రకు తగిన న్యాయం చేయలేరని భావించడంతో, తాజాగా పరిణీతిని సంప్రదించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ’ పేరిట నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ధోనీ భార్య సాక్షీ రావత్ పాత్రకు పరిణీతి అతికినట్లుగా సరిపోతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. పరిణీతి కూడా ఈ సినిమా చేసే విషయంలో ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నారట.