పిల్ల రాక్షసి సాహసం | Pilla Rakshasi Movie Theatrical Trailer | Sakshi
Sakshi News home page

పిల్ల రాక్షసి సాహసం

Published Sun, Oct 23 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

పిల్ల రాక్షసి సాహసం

పిల్ల రాక్షసి సాహసం

‘‘బిచ్చగాడు’ వంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించి, హిట్ సాధించిన నిర్మాతల నుంచి ‘పిల్ల రాక్షసి’ వంటి మరో వైవిధ్యమైన చిత్రం వస్తుందంటే వారి అభిరుచి అర్థమవుతోంది. తెలుగు ప్రేక్షకులు విభిన్నమైన కథా చిత్రాలను ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మలయాళంలో హిట్ అయిన ఈ చిత్రం ఇక్కడ కూడా విజయం సాధించాలి’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. మలయాళంలో హిట్ అయిన ‘ఆన్ మరియ కలిప్పిలాను’ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి ‘పిల్ల రాక్షసి’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మిథున్ మాన్యూల్ థామస్ దర్శకుడు.

సారా అర్జున్ టైటిల్  పాత్రలో, ‘ఓకే బంగారం’ ఫేం దుల్కర్ సల్మాన్ ముఖ్య పాత్రలో నటించారు. షాన్ రెహమాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీ, ట్రైలర్‌ను నరేశ్ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఓ మోసగాడిపై చిన్నారి ఎటువంటి సాహసం చేసిందన్నదే కథాంశం. ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తాయి. నవంబరు 4న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. దర్శకుడు మిథున్, హీరోయిన్ లియోనా లిషాయ్, చదలవాడ తిరుపతిరావు, చదలవాడ లక్ష్మణ్, భాషాశ్రీ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement