
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌కు ఎలాంటి స్పందన వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీట్వీట్స్, కామెంట్స్, ఫొటోలు, వీడియోలతో ఆయన అభిమానులు ట్విటర్‌ను హోరెత్తించారు. ‘మహానటి’ వంటి అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించి ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ఆ తర్వాత ఏకంగా ప్రభాస్‌తోనే సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. అలా ప్రభాస్ 21వ చిత్రం నాగ్ అశ్విన్‌తో ఫిక్సయిపోయింది. (ప్రభాస్ కళ్లు నాకు చాలా ఇష్టం..)
As promised, here it is - our next big announcement! WELCOMING THE SUPERSTAR ♥️https://t.co/QqWERCVywC#Prabhas @deepikapadukone @nagashwin7 @vyjayanthifilms #Prabhas21 #DeepikaPrabhas
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 19, 2020
వైజయంతీ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నిర్మాత అశ్వినీదత్ పాన్ వరల్డ్ మూవీగా రూపొందించనున్నారు. ఈ సినిమా నుంచి జూలై 19న ఉదయం 11 గంటలకు అదిరిపోయే అప్‌డేట్ ఉండబోతుందని వైజయంతీ మూవీస్ ఆదివారం ట్వీట్ చేసింది. అప్పటి నుంచి అభిమానుల ఉత్సాహం అంతా ఇంతా కాదు. డార్లింగ్ అప్‌డేట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. తీరా ఆ సమయం రానే వచ్చింది. 21వ సినిమాలో ప్రభాస్‌తో కలిసి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణే నటించనుంది. దీపికకు తెలుగులో ఇదే తొలి సినిమా కావడం విశేషం. (ప్రభాస్-అశ్విన్ చిత్రం : విలన్ అతడేనా?)