అరెస్ట్ చేయలేరు... | Puri Jagannadh's 'ISM' first look posters released as birthday treat for Nandamuri Kalyan Ram fans | Sakshi
Sakshi News home page

అరెస్ట్ చేయలేరు...

Published Tue, Jul 5 2016 12:15 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

అరెస్ట్ చేయలేరు... - Sakshi

అరెస్ట్ చేయలేరు...

మిగతా దర్శకుల సినిమాల్లో కాస్త బుద్ధిగా కనిపించే మన హీరోలు... డైరక్టర్ పూరీ జగన్నాథ్ చేతిలో పడగానే పోకిరీ లుక్‌లోకి వచ్చేస్తారు. ‘ఇజం’ పోస్టర్‌లో కల్యాణ్‌రామ్‌ని చూడండి... ఇప్పటిదాకా ఈ నందమూరి హీరోలో కనిపించని ఆ రఫ్ లుక్ వచ్చేసింది. లుక్ మాత్రమే కాదు... రేపు సినిమాలో ఉండబోయే క్యారెక్టరైజేషన్, డైలాగ్ మాడ్యులేషన్ అంతా ఈ పోస్టర్‌లో తినబోయే ముందు రుచిని చూపిస్తోంది. ‘యూకెన్ అరెస్ట్ దిస్ గై, బట్ యు కెనాట్ అరెస్ట్ హిజ్ ఐడియా’ అంటున్నారు పూరీ జగన్నాథ్.

ఆయన దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ హీరోగా వస్తున్న క్రేజీ మూవీ ‘ఇజం’. మంగళవారం కల్యాణ్‌రామ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ- ‘‘పూరీ జగన్నాథ్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తై... ‘ఇజం’ మరో ఎత్తు’’ అన్నారు. పూరి మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ చాలా కొత్తగా కనిపిస్తారు. జర్నలిస్టుగా ఓ పవర్‌ఫుల్ పాత్ర చేస్తున్నారు. డైరక్టర్‌గా నాకూ, హీరోగా కల్యాణ్‌రామ్‌కు కెరీర్‌లో చెప్పుకునే సినిమా అవుతుంది’’ అన్నారు. ఆగస్టు 9 నుంచి స్పెయిన్‌లో భారీ షెడ్యూల్ జరుపుకోనున్న ఈ సినిమాను సెప్టెంబర్ 29న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement