మహిళలకు మాత్రమే! | Radikaa Sarathkumar as the host of Kodeeswari | Sakshi
Sakshi News home page

మహిళలకు మాత్రమే!

Published Sat, Oct 19 2019 2:28 AM | Last Updated on Sat, Oct 19 2019 2:28 AM

Radikaa Sarathkumar as the host of Kodeeswari - Sakshi

రాధిక

నటిగా ఎప్పుడో నిరూపించుకున్నారు రాధిక. వెండితెరపై సినిమాలతో, బుల్లితెరపై సీరియల్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆమె కొందరిని కోటీశ్వరులను చేయబోతున్నారు. క్విజ్‌లో క్వశ్చన్స్‌కు సరైన సమాధానాలు చెబితే కోటీశ్వరులు అయిపోయే అవకాశం ఉన్న షోను హోస్ట్‌ చేయబోతున్నారు. ఈ షోలో మరో విశేషం ఏంటంటే.. ఇందులో కేవలం మహిళలు మాత్రమే పాల్గొంటారట. హిందీ పాపులర్‌ టీవీ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ షో ఆధారంగా ఈ షోను డిజైన్‌ చేశారని టాక్‌. ఆల్రెడీ ఈ షోకు సంబంధించిన ఫొటోషూట్‌లో కూడా పాల్గొన్నారు రాధిక. డిసెంబరు నుంచి ఓ ప్రముఖ చానెల్‌లో ఈ షో ప్రసారం కానుంది. ఈ షోకు ‘కోడీశ్వరి’ అనే పేరు పెట్టాలనకుంటున్నారట.  అంటే.. కోటీశ్వరి అని అర్థం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement