'పూరి, కేసీఆర్లను మిస్ అవుతా..!' | Ramgopal varma shifting back to mumbai | Sakshi
Sakshi News home page

'పూరి, కేసీఆర్లను మిస్ అవుతా..!'

Published Sat, Dec 26 2015 11:33 AM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

'పూరి, కేసీఆర్లను మిస్ అవుతా..!' - Sakshi

'పూరి, కేసీఆర్లను మిస్ అవుతా..!'

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న రామ్ గోపాల్ వర్మ కొద్ది రోజులుగా సౌత్ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్  చేస్తూ హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ముఖ్యంగా ఇటీవల కాలం వర్మ తెలుగులో తెరకెక్కించిన సినిమాలు ఆయన టాలెంట్ మీదే అనుమానం కలిగేలా చేశాయి. వీటితో పాటు మెగా ఫ్యామిలీ మీద వర్మ చేసిన ట్విట్టర్ కామెంట్లు కూడా అభిమానులకు కోపం తెప్పించాయి.

తన తెలుగు సినిమాలతో తనకే బోర్ కొట్టిందో, లేక బాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి వర్మకు ఆహ్వానం పలికిందో తెలీదూ కానీ, త్వరలోనే ముంబై వెళ్లిపోతున్నట్టుగా ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. ఈ విషయాన్నే తానే స్వయంగా ప్రకటిస్తూ ' కిల్లింగ్ వీరప్పన్ సినిమా రిలీజ్ తరువాత, ముంబై వెళ్లిపోతున్నాను. పూరి జగన్నాథ్, కేసీఆర్, మా అమ్మ, ఇంకా మెగా ఫ్యామిలీ మీద నేను చేసే ట్వీట్స్ మిస్ అవుతాను' అంటూ ట్వీట్ చేశాడు. వర్మ ముంబై వెళ్లిపోవటంతో మెగా అభిమానులు ఆనంద పడినా, సగటు సినీ అభిమాని మాత్రం కాస్త నిరాశకు గురువుతాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement