‘నా కొడుకు నా కంటే అందగాడు’ | Saif Ali Khan Son Ibrahim Ali Khans Debut In Bollywood | Sakshi
Sakshi News home page

‘నా కొడుకు నా కంటే అందగాడు’

Published Tue, Jul 23 2019 7:11 PM | Last Updated on Tue, Jul 23 2019 7:42 PM

Saif Ali Khan Son Ibrahim Ali Khans Debut  In Bollywood - Sakshi

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ గారాల పట్టీ సారా అలీఖాన్‌ బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇప్పడు సైఫ్‌ కొడుకు ఇబ్రహిం అలీఖాన్‌ వంతు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇబ్రహిం బాలీవుడ్‌ ఎంట్రీపై సైఫ్‌ స్పందించాడు. ఇబ్రహిం తన కంటే అందంగా ఉన్నాడని.. మంచి బాడీ, లుక్‌ కూడా ఉందని పేర్కొన్నాడు. అతడొక చార్మింగ్‌ బాయ్‌, ఇబ్రహింకు నటనపై ఆసక్తి ఉంటే సినీరంగ ప్రవేశం గురించి అలోచిస్తానని తెలిపాడు.

అయితే ఇబ్రహిం ఇంకా చిన్నవాడే, చదువు అయిపోయాక ఏ రంగాన్ని కోరుకుంటే.. దానికే సపోర్టు చేస్తానని అన్నాడు. అయితే ఇటీవల సారా అలీఖాన్‌.. తన సోదరుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం సైఫ్‌ అలీఖాన్‌ లండన్‌లో జరుగుతున్న ‘జవానీ జనేమాన్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సైఫ్‌.. ఆ సినిమాలో హిరోయిన్‌ తండ్రి పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement