షారుక్, సల్మాన్ కలుస్తారా?
షారుక్, సల్మాన్ కలుస్తారా?
Published Thu, Jan 2 2014 12:18 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
బాలీవుడ్‌లో ఖాన్‌లదే హవా. ఆమిర్‌ఖాన్, షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్... ఈ ముగ్గురు సినిమాల మధ్యే పోటీ ఎక్కువ జరుగుతుంటుంది. ఎంత పోటీ ఉన్నా కూడా షారుక్-సల్మాన్‌ల మధ్య సత్సంబంధాలే ఉండేవి. అయితే కత్రినా కైఫ్ కారణంగా ఈ మిత్రుల మధ్య వైరం మొదలైంది. అది కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో. ఇదంతా అందరికీ తెలిసిన కథే. ఆ తర్వాత ఇఫ్తార్ విందులో మళ్లీ ఇద్దరూ కలుసుకున్నారు కానీ, పాత స్నేహం పునరుద్ధరించుకున్నారా లేదా? అనేది ఎవ్వరికీ తెలియదు.
ఈ నేపథ్యంలో వీరిద్దర్నీ కలిపి ఓ పాటలో నర్తింపజేయడానికి దర్శకురాలు ఫరాఖాన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. షారుక్‌ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొనే నటిస్తున్న ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రంలో వీరితో స్టెప్పులు వేయించడానికి ఫరాఖాన్ పావులు కదుపుతున్నారు. గతంలో ‘ఓం శాంతి ఓం’ చిత్రంలో బాలీవుడ్ తారలతో కలిపి చిత్రీకరించిన ఓ పాటలో సల్మాన్, షారుక్‌లు స్టెప్పులేసి అదరగొట్టడమే కాకుండా అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే ఈ విషయంపై ఖాన్‌లిద్దరూ పెదవి విప్పలేదు. ఏదిఏమైనా.. అన్ని వ్యవహారాలు వర్కవుట్ అయితే... ఇద్దరూ ఖాన్‌లు మళ్లీ తెరపై కనిపించి అభిమానులను ఆకట్టుకోవడ ం ఖాయం.
Advertisement
Advertisement