'సరైన దర్శకుల చేతిలో పడితే...' | Sky is the limit for me with right director: Alia Bhatt | Sakshi
Sakshi News home page

'సరైన దర్శకుల చేతిలో పడితే...'

Published Fri, Jun 24 2016 12:56 PM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

'సరైన దర్శకుల చేతిలో పడితే...'

'సరైన దర్శకుల చేతిలో పడితే...'

న్యూఢిల్లీ: నటనలో ఆకాశమే తనకు హద్దు అని బాలీవుడ్ సంచలనం అలియా భట్ పేర్కొంది. తాను దర్శకుల నటిని అని చెప్పింది. 'ఉడ్తా పంజాబ్' సినిమాలో అలియా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సరైన దర్శకుల చేతిలో పడితే తెరపై సత్తా చూపుతానని 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' స్టార్ పేర్కొంది. 'ప్రతి కేరెక్టర్ నాకు విభిన్నమైందే. నేను దర్శకుల నటిని. దర్శకులు నన్ను సరిగా నడిపిస్తే నటనలో ఆకాశమే నాకు హద్ద'ని అలియా చెప్పింది.

ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ కుమార్తె అయిన 23 ఏళ్ల అలియా 'ఉడ్తా పంజాబ్' డీగ్లామర్ రోల్ చేసి మెప్పించింది. ఈ పాత్ర కోసం చాలా కసరత్తు చేశానని వెల్లడించింది. మాండలికం, బాడీ లాంగ్వేజ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపింది. 'హైవే' సినిమాకు పెద్దగా కష్టపడలేదని, దర్శకుడు చెప్పినట్టే చేశానని చెప్పింది. భావోద్వేగాలతో కూడిన పాత్రల్లో రాణించడానికి ప్రయత్నిస్తున్నానని అంది. బద్రీనాథ్ కీ దుల్హానియా, శుద్ధి, గౌరి షిండే సినిమాల్లో అలియా నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement