బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు శుభ‌వార్త‌..! | Television Show shoots To begin by End Of June With New Guidelines | Sakshi
Sakshi News home page

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు శుభ‌వార్త‌..!

Published Thu, May 14 2020 9:29 AM | Last Updated on Thu, May 14 2020 10:02 AM

Television Show shoots To begin by End Of June With New Guidelines - Sakshi

ముంబై : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు శుభ‌వార్త‌.. ఎంతోమంది మ‌హిళ‌లు అభిమానించే సీరియ‌ళ్లు, టీవీ షోలు త్వ‌ర‌లో త‌మ టెలివిజ‌న్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాయి ఎంత‌గానో ఎదురుచూస్తున్న‌సీరియ‌ళ్ల‌ షూటింగ్‌లు పునఃప్రారంభం కానున్నాయి. నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించి జూన్ చివ‌రి వారంలో ఈ ప్ర‌క్రియ  మొద‌లు ‌కానుంది. ఈ విష‌యాన్ని ఫెడ‌రేష‌న్ ఆఫ్ వెస్ట్ర‌న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ అధ్య‌క్షుడు బిఎన్ ‌తివారీ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. (ప్రేయ‌సిని పెళ్లాడిన హీరో నిఖిల్ )

లాక్‌డౌన్ కార‌ణంగా అన్ని ప్ర‌జా ర‌వాణా, స‌మావేశాలు, విద్యాసంస్థ‌లు యూత‌ప‌డిన విష‌యం తెలిసిందే. క‌రోనా నేప‌థ్యంలో సీరియ‌‌ళ్లు, టీవీ షో షూటింగ్ నిలిచిపోవ‌డంతో మ‌హిళ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలో సీరియ‌ళ్లు మొద‌టి నుంచి ప్ర‌సారం చేసినప్ప‌టికీ ఆస‌క్తిగా వీక్షిస్తు‌న్నారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్‌ చెబుతూ ఇక‌పై అనేక‌ కార్య‌క్ర‌మాలు త్వ‌రలో పరిమిత సిబ్బందితో ప్రారంభం కానున్నాయి. సీరియ‌ళ్ల‌లో ప‌నిచేసే వారిని దృష్టిలో ఉంచుకుని నిర్మాతలకు కొన్ని షరతులు పెట్టినట్లు తివారీ వెల్లడించారు. షూటింగ్‌ తిరిగి ప్రారంభించడానికి టీవీ నిర్మాతలు  వీటిని అంగీకరించాల్సి ఉంటుంది. అవేంటంటే

1. ముఖానికి మాస్కును ధరించడం. నిత్యం శానిటైజర్‌ను ఉప‌యోగించాలి. ప్రతి సెట్లో ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు. వీరు షూటింగ్‌లో క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నారా అనేది ప‌ర్యవేక్షింస్తుంటారు. పూర్తి నిబంధ‌న‌లు పాటించే అంత వ‌ర‌కు ఇన్స్పెక్టర్ అక్కడే ఉంటారు. (మొదటిసారి డేటింగ్‌కు వెళుతున్నాడు అందుకే..)

2. కరోనావైరస్ కార‌ణంగా ఏ ఆర్టిస్ట్, కార్మికుడు మరణిస్తే సంబంధిత‌ ఛానెల్, నిర్మాత క‌లిసి చ‌నిపోయిన వారి కుటుంబానికి రూ .50 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. వీటితోపాటు వారి వైద్య ఖర్చులను భ‌రించాలి. అలాగే ప్ర‌మాద‌వ‌శాత్తు షూటింగ్‌లో మరణించిన వారికి, నిర్మాతలు రూ .40-42 లక్షలు ఇవ్వాలి. అయితే ఈ క‌నీస ప‌రిహార‌ మొత్తాన్ని ఎఫ్‌డ‌బ్ల్యూఐఎస్‌సీ  రూ .50 లక్షలకు పెంచింది. దీని ద్వారా కార్మికుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంద‌ని ఎఫ్‌డ‌బ్ల్యూఐఎస్ పేర్కొంది. వారికి ఏదైనా జరిగితే నిర్మాతలు వారి కుటుంబాన్ని చూసుకుంటారరు భరోసా ఉంటుంద‌న్నారు.

3. సాధార‌ణంగా షూటింగ్ సమయంలో  కనీసం 100 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ప‌నిచేస్తుంటారు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థుల కార‌ణంగా ఈ సంఖ్య‌ను స‌గానికి అంటే 50శాతం సిబ్బంతితో నిర్వ‌హించాల్సి ఉంటుంది. అయితే మిగ‌తావారు త‌మ ఉపాధిని కోల్పోకుండా ఉండేందుకు అంద‌రిని షిఫ్టుల వారిగా ప‌నికి అనుమ‌తించాల్సి ఉంటుంది. అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం ఉంది. 50 ఏళ్లు పైబడిన వారు మాత్రం మ‌రో మూడు నెలలు ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇత‌రుల‌తో పోలిస్తే వీరికి క‌రోనా సోకే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది.

4. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ ఎల్లప్పుడూ సెట్స్‌లో అందుబాటులో ఉండాలి. ప్ర‌స్తుతానికి ఈ  కొత్త మార్గదర్శకాలను ఎఫ్‌డ‌బ్ల్యూఐఎస్‌సీ  విడుద‌ల చేసింది. అయితే ప‌రిస్థితిని బ‌ట్టి త్వ‌ర‌లో మ‌ళ్లీ నిబంధ‌న‌ల‌ను చేయ‌నున్న‌ట్లు తెలిపింది. దీనికి సంబంధించి సీరియ‌ళ్ల నిర్మాతలు, ఛానల్ అధినేత‌ల‌తో ఎఫ్‌డ‌బ్ల్యూఐఎస్‌సీ  త్వ‌ర‌లో వర్చువల్ సమావేశం నిర్వహించ‌నుంది. (వైరల్‌ : ఇప్పుడంతా మాదే రాజ్యం )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement