భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి మరణం పట్ల పలువురు సినిమా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయాలకే వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయాలు, అంకిత భావం, పట్టుదల కారణంగా ఎంతో మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయి. ఎంతో ప్రియమైన మహానేతకు ఘన నివాళులు. - ఎస్ ఎస్ రాజమౌళి
నిజమైన నాయకుడు. నిస్వార్థ వ్యక్తిత్వం కలవారు. మార్గదర్శి. భారత దేశం గొప్ప నేతను కోల్పోయింది. నిజాయితీ, ప్రఙ్ఞ ఆయన సొంతం. ఆయనలోని ఈ గొప్ప గుణాలను ప్రతీ రాజకీయ నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. - కొరటాల శివ
నాకెంతో ఇష్టమైన నేత అటల్ ఇక లేరనే విషయం ఎంతో బాధాకరంగా ఉంది. కొందరు నేతలు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి వ్యక్తిత్వం ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తారు. వారిలో అటల్ జీ ముందు వరుసలో ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. - శ్రీను వైట్ల
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహా నేతకు సెల్యూట్. ధైర్యశాలి, గొప్ప జాతీయవాది. భారత దేశాన్ని కలిపి ఉంచేందుకు స్వర్ణ, చతుర్భుజిలను నిర్మించి ఇచ్చిన గొప్ప నేత. అటల్ జీ మీరు మా గుండెల్లో చిరకాలం నిలిచి ఉంటారు. - జూనియర్ ఎన్టీఆర్
అటల్ జీ మరణంతో ఒక యుగం ముగిసింది. గొప్ప నాయకుడిని దేశం కోల్పోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. - నితిన్
గొప్ప నాయకుడు, కవి, వక్తను ఈరోజు కోల్పోయాం. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ధ్యేయంగా బతికారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. - రానా దగ్గుబాటి
Comments
Please login to add a commentAdd a comment