'గోపాలా..గోపాలా..' కి త్రివిక్రమ్ మాటలు రాయడం లేదు!
'గోపాలా..గోపాలా..' కి త్రివిక్రమ్ మాటలు రాయడం లేదు!
Published Fri, Jun 13 2014 8:31 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
బాలీవుడ్ విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్' చిత్ర రీమేక్ రూపొందుతున్న గోపాలా.. గోపాలా.. చిత్రం వివాదంలో చిక్కుకుంది. గోపాలా..గోపాలా.. చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే గోపాలా..గోపాలా.. చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించడం లేదని.. మీడియాలో వస్తున్న వార్తలన్ని రూమర్లేనని చిత్రానికి సంబంధించిన కొందరు వెల్లడించారు. ఈ చిత్రానికి 'కృష్ణం వందే జగద్గురుమ్' ద్వారా సంభాషణల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుర్రా సాయిమాధవ్ సంభాషణల రచయితగా వ్యవహరిస్తున్నారని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన మాటలను త్రివిక్రమ్ శ్రీనివాస్ రాస్తున్నారనే వార్త కొన్ని వెబ్ సైట్స్, టెలివిజన్ చానెల్స్ లో హల్ చల్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అన్ని సంభాషణలూ సాయిమాధవ్ పూర్తి చేసి, ఇచ్చేశారని గోపాలా..గోపాలా చిత్రానికి సంబంధించిన వర్గాలు స్పష్టం చేశారు. ఈ సినిమాలో పవన్ పాత్ర 30 నిమిషాలే ఉంటుందని కూడా కొన్ని వెబ్ సైట్స్ పేర్కొన్నాయి. ఆ వార్త కూడా నిజం కాదట. మాతృకలో అక్షయ్ కుమర్ పోషించిన పాత్రకంటే.. రీమేక్ లో పవన్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందని సమాచారం. వెంకటేశ్ పాత్రకు సమానంగా పవన్ పాత్ర సాగుతుందని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ నానక్ రామ్ గూడాలో శరవేగంగా జరుగుతోంది.
హిందీలో పరేశ్ రావెల్ పోషించిన పాత్రను వెంకటేశ్, అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను పవన్ కళ్యాణ్, హీరోయిన్ గా శ్రీయ సరన్ గోపాలా..గోపాలా.. చిత్రంలో నటిస్తున్నారు. గోపాలా..గోపాలా.. చిత్రంలో వెంకటేశ్ తనయుడు అర్జున్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చినా.. చిత్ర నిర్మాతలు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Advertisement
Advertisement