
ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న స్టార్లు కూడా వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్‌లో అయితే టాప్ స్టార్లు కూడా డిజిటల్ మీడియంలో సత్తా చాటేందుకు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్‌లో రానా, జగపతి బాబు లాంటి స్టార్స్ ఇప్పటికే వెబ్ సిరీస్‌లలో సందడి చేశారు. డిజిటల్ మార్కెట్ భారీగా విస్తరిస్తుండటంతో తారలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
అయితే టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మాత్రం డిజిటల్ మీడియంకు నో చెప్పేశాడు. తనని తాను బుల్లితెర చూసుకోవటం ఇష్టం లేదన్న విజయ్, ఎప్పటికీ వెబ్ సిరీస్‌లో నటించనని చెప్పేశాడు. అయితే భవిష్యత్తులో వెబ్ సిరీస్‌ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపాడు. ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్ ఈ కామెంట్స్ చేశాడు.
విజయ్ హీరోగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతుండగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాతో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తమిళ దర్శకుడు ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.