వెళ్లండయ్యా... ప్లీజ్! | WATCH Kahaani 2's Mehram: A great Arijit Singh song in Vidya Balan's thriller | Sakshi
Sakshi News home page

వెళ్లండయ్యా... ప్లీజ్!

Published Fri, Nov 11 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

వెళ్లండయ్యా... ప్లీజ్!

వెళ్లండయ్యా... ప్లీజ్!

‘‘మీరిలా చేస్తే మేడమ్ ఇబ్బందిపడతారు. వెళ్లండయ్యా ప్లీజ్... వెళ్లండి’’ అంటూ విద్యాబాలన్ అభిమానులను దర్శకుడు సుజయ్ ఘోష్ బతిమాలుకున్నారు. అయినా అభిమానులు వినలేదు. ‘విద్యా మేడమ్‌ని చూడందే కదిలేది లేదు’ అని మొండికేశారు. మేడమ్ కనిపించారు... కానీ అభిమానులు కదల్లేదు. చూస్తూ ఉండిపొయారు. ఫలితంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది. ప్రస్తుతం విద్యాబాలన్ నటిస్తున్న ‘కహానీ 2: దుర్గా రాణీ సింగ్’ షూటింగ్ లొకేషన్‌లో జరిగిన గందరగోళం ఇది. కోల్‌కతా దగ్గరలోని ఒక చోట ఈ చిత్రం షూటింగ్ ప్లాన్ చేశారు.

ఈ షూటింగ్ గురించి తెలుసుకున్న విద్యాబాలన్ అభిమానులు భారీ ఎత్తున గుమిగూడిపోయారు. దాంతో షూటింగ్‌కి ఆటంకం ఏర్పడింది. దాదాపు నాలుగు గంటలు బ్రేక్ పడింది. ‘‘ఒకానొక దశలో అసలు షూటింగ్ చేయగలుగుతామా? అనిపించింది. ఈ చిన్న ప్రాంతంలో విద్యాకి ఈ రేంజ్‌లో  అభిమానులు ఉంటారని ఊహించలేదు. చివరికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకుని షూటింగ్ కొనసాగించాల్సి వచ్చింది’’ అని దర్శకుడు అన్నారు. మరి.. విద్యానా? మజాకానా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement