గత ఐదేళ్లలో తెలంగాణ లో 2,510 పాఠశాలలు మూతపడ్డాయని కేంద్రం వెల్లడించింది.
మేకపాటి ప్రశ్నకు కేంద్రం సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో తెలంగాణ లో 2,510 పాఠశాలలు మూతపడ్డాయని కేంద్రం వెల్లడించింది. ఏపీలో రెండేళ్లలో 879 పాఠశాలలు మూతపడ్డాయని తెలిపిం ది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోమవారం లోక్‌సభలో అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశవాహ సమాధానమిచ్చారు. ఈ గణాంకాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించాయని, ప్రవేశాల నమోదు ఆధారంగా పాఠశాలల హేతుబద్ధీకరణ వల్ల ఇవి మూతపడ్డాయని వివరించారు. అయితే ఈ పరిణామం వల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.