మద్యం సేవించి స్కూల్ బస్సులు నడుపుతున్న 25 మంది డ్రైవర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
25 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు అరెస్ట్
Feb 3 2017 3:33 PM | Updated on Sep 15 2018 5:45 PM
కొచ్చి: మద్యం సేవించి స్కూల్ బస్సులు నడుపుతున్న 25 మంది డ్రైవర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని నాలుగు జిల్లాల్లో శుక్రవారం ఉదయం ఏక కాలంలో స్కూల్ బస్సుల డ్రైవర్‌లకు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 25 మంది డ్రైవర్లను అరెస్ట్ చేశారు. కొట్టయం, ఇడుక్కి, అలప్పుజ, కోచి జిల్లాల్లో మద్యం మత్తులో స్కూల్ బస్సు డ్రైవర్‌లు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే సమాచారంతో.. ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని ఐజీ పి. విజయన్ విలేకరులకు తెలిపారు.
Advertisement
Advertisement