ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం | 3 Terrorists Killed In Encounter In Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

Published Tue, Jun 16 2020 10:41 AM | Last Updated on Tue, Jun 16 2020 10:45 AM

3 Terrorists Killed In Encounter In Jammu And Kashmir - Sakshi

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాలు... షోపియాన్‌ జిల్లా తుర్క్‌వాంగమ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారం అందడంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. భద్రతా బలగాల మూమెంట్స్‌ను పసిగట్టిన తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు.(నిత్యం ల‌క్ష‌కు త‌క్కువ కాకుండా కేసులు)

కాగా, సంఘటనా స్థలంలో రెండు ఏకే- 47 తుపాకులు, ఇన్సాస్‌ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం రాష్ట్రీయ రైఫిల్‌ స్థావరానికి కూతవేటు దూరంలో ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా, పది రోజుల్లో ముష్కరుల ఏరివేతకు భద్రతా బలగాలు జరిపిన నాలుగో ఆపరేషన్‌ ఇది. ఈ నెలలో జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 19 మంది హతమయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement