మొదటి మూడు స్థానాల్లో మహారాష్ట్ర, అవిభక్త ఏపీ, కర్ణాటక
న్యూఢిల్లీ: సైబర్ నేరాల్లో మహారాష్ట్ర, అవిభక్త ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి. కొత్త ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా నమోదైన కేసులను పరిశీలించినపుడు సైబర్ నేరాల్లో ఈ రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయి. అయితే,.. దేశవ్యాప్తంగా ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలనుంచి వచ్చే ఆదాయంలో 70 శాతం ఈ రాష్ట్రాలనుంచే సమకూరుతోంది. తాజా రికార్డుల ప్రకారం ఇక దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఒక్కఏడాదిలోనే 51.5శాతం పెరిగాయి. 2013లో దేశవ్యాప్తంగా 4,356సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదిక ప్రకారం,.. సైబర్ నేరాలకు సంబంధించి 2013లో మహారాష్ట్రలో 681 కేసులు నమోదయ్యాయి. అదే సంవత్సరం అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 635 కేసులు, కర్ణాటకలో 513 కేసులు నమోదయ్యాయి. అంతకు ుుందు సంవత్సరంతో (2012తో) పోల్చితే సైబర్ నేరాలు ఏపీలో 48శాతం పెరిగాయి.
నగరాల్లో బెంగళూరు టాప్
దేశం ఐటీ రంగానికి రాజధానిగా చెబుతున్న బెంగళూరు నగరంలో అత్యధిక సంఖ్యలో 399 సైబర్ నేరాలు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 173, హైదరాబాద్‌లో 159 కేసులు నమోదయ్యాయి.
51శాతం పెరిగిన సైబర్ నేరాలు
Published Wed, Jul 2 2014 3:40 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement