ఢిల్లీ : కరోనా వైరస్ సోకిన 63 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రిలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మీఠాపూర్ నివాసి అయిన ఆయన గత 10 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. దీనికి సంబంధించి రెగ్యులర్‌గా ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నాడు. కరోనా లక్షణాలతో మే19న బాత్రా ఆసుపత్రిలో చేరగా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీర్ఘకాలిక సమస్యలతో పాటు ఇప్పుడు కోవిడ్ కూడా సోకడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. (భీమ్ యాప్‌లో లోపం? )
సోమవారం మధ్యాహ్న భోజనం తర్వాత 30-40 నిమిషాల తర్వాత అతనికి మందులు ఇవ్వడానికి నర్సు వెళ్లి చూడగా అప్పటికే సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్నట్లు కనిపించాడని బాత్రా హాస్పిటల్ వైద్య డైరెక్టర్ డాక్టర్ ఎస్.సి.ఎల్ గుప్తా అన్నారు. అతన్ని బతికించడానికి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా కోసం ప్రత్యేకంగా నియమించిన ఆసుపత్రుల్లో బాత్రా హాస్పిటల్ కూడా ఒకటి. అయితే గతంలోనూ కరోనా సోకి పలువురు డిప్రెషన్‌కి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారు. మార్చి 19న 23 ఏళ్ల కరోనా బాదితుడు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. (ఇక మద్యం బాటిళ్లపై కోవిడ్ పన్ను! )
Comments
Please login to add a commentAdd a comment