దేశవ్యాప్తంగా ప్రస్తుతం 889 ప్రైవేటు టీవీ చానెళ్లు ప్రసారమవుతున్నాయని తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం 889 ప్రైవేటు టీవీ చానెళ్లు ప్రసారమవుతున్నాయని తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. ఈ ఏడాది జూలై వరకు 149 ఛానెళ్ల లెసైన్సులను కేంద్ర సమాచార, ప్రసార శాఖ రద్దుచేసింది. 399 వార్తా చానెళ్లు. 768 ప్రైవేటు టీవీ చానెళ్లు అప్‌లింక్, డౌన్‌లింక్ అనుమతులు పొందాయి.