ఆధార్‌పై సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు
పాస్‌పోర్టులు, మొబైల్ కనెక్షన్లు, పాన్ కార్డులు.. ఇలా ప్రతిదానికీ ఆధార్ కార్డును లింక్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఆధార్‌ను తప్పనిసరి చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే, బ్యాంకు ఖాతాలు తెరవడం లాంటి విషయాల్లో మాత్రం ఆధార్ కార్డు వినియోగించడాన్ని ఆపకూడదని తెలిపింది. ఆధార్ గురించి వస్తున్న పిటిషన్లు అన్నింటినీ విచారించేందుకు త్వరలో ఏడుగురు న్యాయమూర్తులతో ఓ ధర్మాసనం ఏర్పాటుచేస్తామని, అయితే అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని చెప్పింది.
ఆధార్ కార్డును తప్పనిసరి చేయడంపై దాఖలైన పిటిషన్‌ను త్వరగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తగిన సమయంలోనే ఆ పిటిషన్‌ను విచారిస్తామంది. భవిష్యత్తులో ఏకైక గుర్తింపు కార్డు ఆధారే అవుతుందని, ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు కూడా అది తప్పనిసరి అవుతుందని, తద్వారా పన్ను ఎగవేతదారుల గుర్తింపు సులభం అవుతుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గత వారం చెప్పారు. ఇప్పటివరకు ఉన్న ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డుల స్థానంలో ఒక్క ఆధార్ కార్డు ఉంచుకుంటే సరిపోతుందని అన్నారు. ప్రభుత్వం భారతీయులకు బలవంతంగా ఆధార్ కార్డులు అంటగడుతోందంటూ ప్రతిపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు లోక్‌సభ నుంచి అప్పట్లో వాకౌట్ చేశారు.