స్టింగ్ ఆపరేషన్‌తో అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి! | Ahead of polls, Trinamool faces sting operation on alleged graft | Sakshi
Sakshi News home page

స్టింగ్ ఆపరేషన్‌తో అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి!

Published Mon, Mar 14 2016 6:36 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

స్టింగ్ ఆపరేషన్‌తో అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి!

స్టింగ్ ఆపరేషన్‌తో అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి!

మరో 15 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఊహించనిరీతిలో వెలుగులోకి వచ్చిన ఓ స్టింగ్ ఆపరేషన్‌ మమత బెనర్జీ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, మంత్రులు లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినట్టు చెప్తున్న ఓ వీడియో ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో హల్‌చల్ చేస్తోంది. మీడియా ఈ స్టింగ్ ఆపరేషన్ గురించే కథనాలు ప్రసారం చేస్తుండటంతో ఇప్పటికే అధికార పక్షంపై ప్రతిపక్షం నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సౌగత్ రాయ్, సుల్తాన్ అహ్మద్, బెంగాల్ మంత్రి సుబ్రత ముఖర్జీ, కోల్‌కతా మేయర్ శోవన్ ఛటర్జీ తదితరులు ఓ కల్పితమైన లాబీకి పలు హామీలు ఇస్తూ.. లంచాలు తీసుకుంటూ ఈ వీడియోలో కనిపించారు. నారదన్యూస్‌.కామ్‌ రెండేళ్ల వ్యవధిలో ఈ స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించింది. అయితే ఈ వీడియోలో సీఎం మమతాబెనర్జీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ వీడియో ప్రామాణికతపై ఒకవైపు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బెంగాల్‌ రాజకీయాలను ఈ స్టింగ్ ఆపరేషన్‌  ఓ కుదుపు కుదిపింది.

ఏప్రిల్ 4 నుంచి ఆరు దఫాలుగా జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్-వామపక్షాల కూటమి, బీజేపీ పోటీపడుతున్నాయి. ఈ స్టింగ్ ఆపరేషన్ నేపథ్యంలో మమతా బెనర్జీ వెంటనే సీఎం పదవి నుంచి దిగిపోవాలని, ఎన్నికలు ముగిసేవరకు కూడా ఆమెకు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదని బీజేపీ మండిపడింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కోసం సీబీఐకి లేఖ రాస్తామని బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement