పట్టుబడ్డ ఉగ్రవాది జాకీర్ ముసా
సాక్షి, న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో జరగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా కన్నేసిందే. ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు ఆల్ ఖైదా రచిస్తోందని ఇంటిలిజెన్స్ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆల్ ఖైదా కమాండర్ జాకీర్ ముసాను పంజాబ్ సరిహద్దుల్లో భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. పంజాబ్- పాకిస్తాన్ సరిహద్దు నుంచి భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది జాకీర్ ముసాను శనివారం బీఎస్‌ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
డిసెంబర్ 7న జరిగే రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అలర్లు సృష్టించేందుకు జాకీర్‌ను ఆల్ ఖైదా పంపిణి దూతగా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని పంజాబ్, రాజస్తాన్ సరిహద్దుల్లో రక్షణ దళాన్ని అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా సరిహద్దు రాష్ట్రాలైన రాజస్తాన్, పంజాబ్‌లు పాకిస్తాన్‌తో 1090 కి.మీ మెర సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో సరిహద్దుల్లో హైలర్ట్ ప్రకటించినట్లు రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment