గంటన్నరకో మద్యం చావు
న్యూఢిల్లీ : 96/1... ఇది క్రికెట్ స్కోరు కాదు. ఆల్కహాల్ స్కోరు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ఆధారంగా ఇండియా స్పెండ్ అనే సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం ప్రతీ 96 నిమిషాలకో ప్రాణం ఆల్కహాల్‌కు బలవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మన దేశంలో 2003-05లో తలసరి మద్య వినియోగం 1.8 లీటర్లుండగా 2010-12 నాటికి 38 శాతం పెరిగి 2.2 లీటర్లయింది.
2014లో సరాసరిన రోజుకు అయిదుగురిని మద్యం మింగేసింది. ఇప్పడీ సంఖ్య మరింత పెరిగి 15కి చేరింది. ఈ నివేదిక ప్రకారం అతిగా మద్యం సేవించేవారు దేశంలో 11% మంది ఉన్నారు. 2013లో 387 మంది మంది మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోగా, 2014కు ఆ సంఖ్య 339 శాతం పెరిగి 1,699కి చేరింది. దీంతో మద్య నిషేధానికి సర్వత్రా మద్దతు లభిస్తోంది.