
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్య పరిస్థితిపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అమిత్ షా శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో వాజ్‌పేయి చికిత్స పొందుతున్న ఎయిమ్స్‌కు వెళ్లి, వైద్యులతో మాట్లాడారు. అనంతరం రాత్రి 8.15 గంటలకు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎయిమ్స్‌కు వెళ్లారు. వాజ్‌పేయి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. మూత్ర సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబసభ్యులు జూన్ 11వ తేదీన ఎయిమ్స్‌లో చేర్పించారు. ప్రస్తుతం వాజ్‌పేయి కిడ్నీ ఒక్కటే పనిచేస్తోంది. ఆయనకు డయాబెటిస్‌తోపాటు డిమెన్షియా ఉంది.